సూపర్ ఓవర్లో బెంగళూరు విక్టరీ

సూపర్ ఓవర్లో బెంగళూరు విక్టరీ

ఆద్యంతం ఉత్కంఠ.. అంతకుమించిన పోరాట స్ఫూర్తి రగిలిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాయల్​చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు పైచేయి సాధించింది..!  ఏబీ డివిలియర్స్‌‌‌‌‌‌‌‌ (24 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 55 నాటౌట్‌‌‌‌‌‌‌‌, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), దేవదత్‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌ (40 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 54, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫించ్‌‌‌‌‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 52, 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలతో చెలరేగి భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ నిర్దేశించినా.. ముంబై ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ (58 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 99, 2 ఫోర్లు, 9 సిక్సర్లు), పొలార్డ్‌‌‌‌‌‌‌‌ (24 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 60 నాటౌట్‌‌‌‌‌‌‌‌, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టడంతో స్కోర్లు సమమైన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని సూపర్​ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలుపు వరించింది..!!

దుబాయ్‌‌‌‌‌‌‌:  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న బెంగళూరు.. ఐపీఎల్‌‌లో రెండో విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్ ఎంత ప్రతిఘటించినా.. ఆఖరి బాల్ వరకు పట్టువిడవకుండా పోరాడుతూ సూపర్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో అద్భుతాన్ని చేసింది. ఫలితంగా సోమవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఆర్‌‌‌‌సీబీ వన్ ఓవర్‌‌‌‌ ఎలిమినేటర్‌‌‌‌లో ముంబైకి చెక్​ పెట్టింది. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 201/3 స్కోరు చేసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 201/5 స్కోరే చేసింది. సబ్‌‌స్టిట్యూట్‌‌గా వచ్చిన ఆర్​సీబీ ప్లేయర్‌‌‌‌ పవన్‌‌ నేగి మూడు సూపర్‌‌‌‌ క్యాచ్‌‌లు అందుకుని ముంబై  పతనానికి నాంది పలికాడు. డివిలియర్స్​కు మ్యాన్​ ఆఫ్ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది.

ముగ్గురూ.. ముగ్గురే

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన బెంగళూరుకు అదిరిపోయే ఆరంభం దక్కింది. మొన్న పడిక్కల్‌‌ కొడితే.. ఈసారి మాత్రం ఫించ్‌‌ దంచికొట్టాడు. ముంబై పేస్‌‌ త్రయం బౌల్ట్‌‌, బుమ్రా, చహర్‌‌ను ఈజీగా ఎదుర్కొంటూ పరుగులు సాధించాడు. తొలి రెండు ఓవర్లలో రెండు ఫోర్లతో 16 రన్స్‌‌ రాగా.. మూడో ఓవర్‌‌ థర్డ్‌‌ బాల్‌‌కు ఫించ్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను మిడ్‌‌ వికెట్‌‌లో రోహిత్‌‌ మిస్‌‌ చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫించ్‌‌.. తర్వాతి బాల్‌‌ను లాంగాన్‌‌లో భారీ సిక్సర్‌‌గా మల్చడంతో ఈ ఓవర్‌‌లో 10 రన్స్‌‌ వచ్చాయి. ఐదో ఓవర్‌‌లో హ్యాట్రిక్‌‌ ఫోర్స్‌‌ బాదిన ఫించ్‌‌.. పవర్‌‌ప్లేలో టీమ్‌‌ స్కోరును 59/0కు పెంచాడు. ఛేంజ్‌‌ బౌలర్స్‌‌గా వచ్చిన క్రునాల్‌‌ కొద్దిగా కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.  తర్వాతి  రెండు ఓవర్లలో 6, 9 రన్స్‌‌ మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో 31 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసిన ఫించ్‌‌ను తొమ్మిదో ఓవర్‌‌లో బౌల్ట్‌‌ దెబ్బకొట్టాడు. ఫుల్‌‌ స్లోగా వేసిన బాల్‌‌ను ఫించ్‌‌ భారీ షాట్‌‌ కొట్టగా లాంగాన్‌‌లో పొలార్డ్‌‌ క్యాచ్‌‌ అందుకున్నాడు. దీంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 81 పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. తర్వాతి ఓవర్‌‌లో క్రునాల్‌‌ నాలుగే రన్స్‌‌ ఇవ్వడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో బెంగళూరు 85/1 స్కోరు చేసింది. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన కోహ్లీ (3) మరోసారి నిరాశపర్చాడు. 13వ ఓవర్‌‌లో చాహర్‌‌ సంధించిన గోల్డెన్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌కు విరాట్‌‌.. రోహిత్‌‌ చేతికి చిక్యాడు.

డివిలియర్స్‌‌ మెరుపులు

ఈ టైమ్‌‌లో పడిక్కల్‌‌తో జత కలిసిన డివిలియర్స్‌‌ సిక్స్‌‌లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. కేవలం 23 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ మార్క్‌‌ను అందుకున్నాడు. 14వ ఓవర్‌‌లో పడిక్కల్‌‌ వరుసగా రెండు సిక్సర్లు కొడితే, తర్వాతి ఓవర్‌‌లో డివిలియర్స్‌‌ మరో ఫోర్‌‌ను జోడించాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి ఆర్‌‌సీబీ 123/2 స్కోరు చేసింది. పడిక్కల్‌‌ కూడా 37 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. 16వ ఓవర్‌‌లో చెరో ఫోర్‌‌ కొట్టగా, బుమ్రా వేసిన 17వ ఓవర్‌‌లో డివిలియర్స్‌‌ 6, 6, 4తో 18 రన్స్‌‌ పిండుకున్నాడు. అదే ఊపులో 18వ ఓవర్‌‌ ఫస్ట్‌‌బాల్‌‌ను పడిక్కల్‌‌ గాల్లోకి లేపగా బౌండ్రీ వద్ద పొలార్డ్‌‌ అందుకున్నాడు. దీంతో మూడో వికెట్‌‌కు 62 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ ఓవర్‌‌లో డివిలియర్స్‌‌ సిక్స్‌‌తో 10 రన్స్‌‌ రాబట్టాడు. లాస్ట్‌‌ రెండు ఓవర్లలో దూబే (27 నాటౌట్‌‌), డివిలియర్స్‌‌ మరింత రెచ్చిపోయారు 19వ ఓవర్‌‌లో 4, 4, 6తో 17 రన్స్‌‌, ఆఖరి ఓవర్‌‌లో దూబే 6, 6, 6 తో 20 రన్స్‌‌ రాబట్టాడు. నాలుగో వికెట్‌‌కు జస్ట్‌‌ 17 బాల్స్‌‌లో 47 రన్స్‌‌ రావడంతో  ఆర్‌‌సీబీ స్కోరు 200లు దాటింది.

చకచకా…

టార్గెట్ ఛేజింగ్‌‌లో ముంబైకి వరుస షాక్‌‌లు తగిలాయి. కేవలం ఆరు బాల్స్‌‌ తేడాలో రోహిత్​ (8), సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌ (0) ఔటయ్యారు. దీంతో 16/1 స్కోరుతో ముంబై ఎదురీత మొదలుపెట్టింది. ఈ టైమ్‌‌లో డికాక్‌‌ (14), ఇషాన్‌‌ కిషన్‌‌  ఇన్నింగ్స్‌‌ నిర్మించే బాధ్యతను తీసుకున్నారు. ఐదో ఓవర్‌‌‌‌లో ఇషాన్‌‌ భారీ సిక్సర్ కొట్టడంతో పవర్‌‌‌‌ప్లేలో ముంబై 35/2 స్కోరు చేసింది. కానీ నిదానంగా సాగుతున్న ఇన్నింగ్స్‌‌లో మళ్లీ అలజడి మొదలైంది. ఏడో ఓవర్‌‌‌‌లో చహల్​.. డికాక్‌‌ను ఔట్‌‌ చేయడంతో స్కోరు వేగం మందగించింది. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన హార్దిక్​ (15) వచ్చి రావడంతోనే జంపా బౌలింగ్‌‌లో సిక్సర్‌‌‌‌ బాదినా.. స్పిన్నర్​ ప్రతీకారం తీర్చుకున్నాడు. పది ఓవర్లలో 63/3తో ఉన్న ముంబైని మళ్లీ దెబ్బకొట్టాడు. 11వ ఓవర్​లో ఇషాన్​.. రెండు సిక్సర్లతో 14 రన్స్​రాబట్టినా, తర్వాతి ఓవర్‌‌‌‌లో హార్దిక్​ను జంపా పెవిలియన్‌‌కు చేర్చడంతో స్కోరు 78/4గా మారింది. నాలుగో వికెట్‌‌కు 37 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ ముగిసింది.

సిక్సర్ల పొ‘లార్డ్‌‌’

పాండ్యా ఔట్‌‌తో క్రీజులోకి వచ్చిన పొలార్డ్, స్టార్టింగ్‌‌లో స్లోగా ఆడినా.. తర్వాత విజృంభించాడు. రెండో ఎండ్‌‌లో కిషన్‌‌ కూడా బ్యాట్‌‌ ఝుళిపించడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. 14వ ఓవర్లో జంపా బాల్‌‌ను మిడ్‌‌ వికెట్‌‌లో స్టాండ్స్‌‌లోకి పంపిన ఇషాన్‌‌ 39 బాల్స్‌‌లో హాఫ్​ సెంచరీ కంప్లీట్‌‌ చేశాడు. 15వ ఓవర్‌‌‌‌లో సిక్స్, ఫోర్‌‌‌‌తో 14 రన్స్ రాబట్టాడు. ఇక టార్గెట్‌‌ 30 బాల్స్‌‌లో 90 రన్స్‌‌ కావడంతో పొలార్డ్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. 16వ ఓవర్‌‌‌‌లో ఇషాన్ ఓ ఫోర్​తో 10 రన్స్ చేసినా.. 17వ ఓవర్‌‌ (జంపా)‌‌లో పొలార్డ్ 4, 6, 6, 6తో 27 రన్స్ దంచాడు. అయితే లాస్ట్ బాల్‌‌కు ఇచ్చిన క్యాచ్‌‌ను బ్యాక్‌‌వర్డ్‌‌ పాయింట్‌‌ వద్ద నేగి జారవిడిచి మూల్యం చెల్లించాడు. దీంతో ముంబైకి18 బాల్స్‌‌లో 53 రన్స్ అవసరం కాగా.. చహల్​బౌలింగ్‌‌కు దిగాడు. వెంటనే పొలార్డ్‌‌ రెండు సిక్సర్లు, కిషన్​ఓ సిక్సర్​ కొట్టడంతో 22 రన్స్ వచ్చాయి. ఇక 12 బాల్స్​ 31 రన్స్​ కావాల్సిన దశలో ఇషాన్​ సిక్సర్ బాదడంతో 19వ ఓవర్​లో 12 రన్స్​ వచ్చాయి. ఆఖరి ఓవర్​లో 19 రన్స్​ చేయాల్సిన టైమ్​లో ఇషాన్​ రెండు సిక్సర్లు బాదినా, ఐదో బాల్‌‌కు ఔట్‌‌కావడంతో విజయ సమీకరణం ఒక బాల్‌‌లో ఐదు రన్స్‌‌గా మారింది. ఈ దశలో పొలార్డ్‌‌ ఫోర్ బాదడంతో మ్యాచ్​సూపర్​ ఓవర్‌‌‌‌కు దారితీసింది. పొలార్డ్, కిషన్.. ఐదో వికెట్‌‌కు 119 రన్స్ జోడించారు.