జులై 26న డ్రీం అచీవ్మెంట్ అవార్డులు

జులై 26న డ్రీం అచీవ్మెంట్ అవార్డులు

బషీర్​బాగ్, వెలుగు: వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి డ్రీమ్ అచీవ్​మెంట్ అవార్డులు అందజేయనున్నట్లు రాయల్ సక్సెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ డైరెక్టర్ హారిక, ఇంటర్నేషనల్ చీఫ్ దిలీప్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి చేతులమీదుగా పోస్టర్​ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 26న గోవాలోని గ్రాండెర్ ‘డి’ సంచిలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని, ముఖ్య అతిథులుగా గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, సీఎం ప్రమోద్ సావాంత్ పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాకేశ్​జైన్, జయకృష్ణ, కిరణ్, నరేశ్, జితేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.