ఇన్వెస్ట్మెంట్ పేరుతో హైదరాబాద్లో రూ. 19 లక్షల ఫ్రాడ్

ఇన్వెస్ట్మెంట్ పేరుతో హైదరాబాద్లో రూ. 19 లక్షల ఫ్రాడ్

బషీర్​బాగ్​,వెలుగు: స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్​మెంట్​ పేరిట ఓ వృద్ధుడి వద్ద స్కామర్లు భారీగా డబ్బు కాజేశారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి ఐఫెక్స్​ క్యాపిటల్​ పేరుతో స్కామర్లు సెబీ , ఎఫ్ఎస్​సీ ఫేక్ డాక్యుమెంట్లు షేర్ చేశారు. వారిని నమ్మి రూ.19 లక్షల 9 వేలు ఇన్వెస్ట్  చేశాడు. ఆ తరువాత స్కామర్లు నంబర్​ బ్లాక్​ చేయడంతో స్కామ్​ అని గుర్తించాడు.

ఫేక్ డీమార్ట్ యాప్​తో రూ.1.17 లక్షలు..

నల్లకుంట ప్రాంతానికి చెందిన 66 ఏళ్ల వృద్ధుడికి స్కామర్స్ డీమార్ట్ రెడీ యాప్​ పేరుతో ఓ లింక్​ను పంపారు. కిరాణా సామాన్లు డిస్కౌంట్ గా వస్తాయని పేర్కొన్నారు. దీంతో వృద్ధుడు ఆ లింక్​ క్లిక్​ చేసి క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేశాడు. వెంటనే ఆయన అకౌంట్​ నుంచి పలు దఫాలుగా రూ.లక్షా 17 వేలు డెబిట్ అయ్యాయి.