మీ దగ్గర ఉన్న నోట్లు చెల్లుతాయి.. ఆందోళన వద్దు

 మీ దగ్గర ఉన్న నోట్లు చెల్లుతాయి.. ఆందోళన వద్దు

రూ. 2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకోవడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. మీ జేబులో ఉన్న రూ. 2 వేల నోట్లు ఖచ్చితంగా చెల్లుబాటు అవుతాయి.  మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలని భయపడాల్సిన పనే లేదు.  రూ. 2 వేల నోట్ల మార్పిడి కోసం ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటిస్తే సరిపోతుంది. 

RBI రూ. 2,000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవడంపై మరి కొన్ని విషయాలను మీకు తెలిజేస్తున్నాం. తక్షణమే రూ.2000 నోట్ల జారీని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులను కోరింది. కాబట్టి రూ. వీటిని మార్చుకోవడానికి ఆర్బీఐ కింది సూచనలు పేర్కొంది. 

ఆందోళన వద్దు ఇలా చేయండి..

  • ఆర్బీఐ ప్రకటన ప్రకారం..బ్యాంకులు ఇకపై రూ.2000 కరెన్సీ నోట్లను జారీ చేయవు. 
  • రూ. 2,000 నోట్లు  సెప్టెంబరు 30  2023 వరకు చలామణి అవుతాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. 
  • ప్రజలు సెప్టెంబర్ 30  2023 వరకు బ్యాంకుల్లో రూ.2,000 కరెన్సీ నోట్లను డిపాజిట్ చేయవచ్చు. అక్కడే  మార్చుకోవచ్చు.
  • రూ.2000 నోట్లను ఒకేసారి రూ.20,000 వరకు మార్చుకునే సౌకర్యం మే 23 నుంచి అందుబాటులోకి రానుంది.