మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). ఈ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. కేవలం రూ. 28–30 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) వెల్లడించారు.
అయితే, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ వరకు ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ.200 కోట్లకు చేరిందన్న ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తూనే వస్తుంది. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్.. అసలు ఫిల్మ్ మేకింగ్ ఖర్చు మాత్రం చాలా నియంత్రితంగా ఉందని, కేవలం రూ. 28–30 కోట్ల బడ్జెట్ మాత్రమే అయిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సాధించిన అఖండ విజయం గురించి సినీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..
రూ, 30 కోట్లను కూడా దాటలేదు..
రీసెంట్గా డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ బడ్జెట్ విశేషాలు పంచుకున్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “ఈ సినిమా నిర్మాణ వ్యయం రూ.28 నుంచి రూ.30 కోట్ల మధ్యే ఉంది. నిజానికి రూ.30 కోట్ల మార్క్‌ను కూడా దాటలేదు” అని తెలిపారు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల రూ.3 నుంచి 4 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.
“వర్షాల వల్ల ఒక పాట సెట్ పూర్తిగా దెబ్బతింది. దానిని మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. అలాగే సమ్మెలు, డేట్ క్లాష్ల కారణంగా షూటింగ్ 82 రోజుల నుంచి 87 రోజులకు పెరిగింది” అని వివరించారు.
లొకేషన్లు, సెట్లలో స్మార్ట్ ప్లానింగ్..
సినిమాకు కావాల్సిన హౌస్ ఇంటీరియర్స్, స్ట్రీట్ సెట్లు ప్రత్యేకంగా నిర్మించామని, శంషాబాద్ సమీపంలోని ఓ రిసార్ట్‌ను రోజుకు రూ.8 నుంచి 9 లక్షల అద్దెతో తీసుకుని కీలక సన్నివేశాలు చిత్రీకరించామని చెప్పారు.
“అవసరం ఉన్న చోట ఖర్చు పెడతాను. కానీ ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గిస్తాను. షూటింగ్ స్పీడ్ కూడా బడ్జెట్ కంట్రోల్లో కీలక పాత్ర పోషించింది” అని అనిల్ అన్నారు.
‘రెమ్యూనరేషన్ ఎక్కువైతే ఖర్చు నియంత్రణ తప్పనిసరి’..
నటుల పారితోషికాలపై ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చకు స్పందించిన అనిల్ రావిపూడి, “రెమ్యూనరేషన్ ఎక్కువైతే నిర్మాణ వ్యయం నియంత్రణలో ఉండాలి. రెండూ ఎక్కువైతే అది ఆత్మహత్యతో సమానం. ఆ స్థితికి నేను ఎప్పుడూ వెళ్లను” అని ఘాటుగా అనిల్ వ్యాఖ్యానించారు. సినిమా రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్ సాధించేలా ప్లానింగ్ చేస్తానని కూడా ఆయన తెలిపారు.
నిర్మాతలకు ముందే లాభాలు..
“రిలీజ్‌కు ముందే నిర్మాతలు సంతృప్తిగా ఉండేలా ప్లాన్ చేశాం. ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణతో అందరూ ఆనందంగా ఉన్నారు”
అని చెప్పారు.
‘సంక్రాంతి వస్తున్నాం’ కంటే పెద్ద ఛాలెంజ్
తన గత చిత్రం సంక్రాంతి వస్తున్నాం రూ.55 కోట్ల బడ్జెట్ తో పోలిస్తే, ఈ చిరంజీవి చిత్రం తనకు ఎక్కువ సవాల్‌గా మారిందని అనిల్ తెలిపారు. “స్టార్ స్టామినా, మార్కెట్ విలువ ఆధారంగా మాత్రమే బడ్జెట్ లెక్కలు వేయాలి. సంఖ్యలు చాలా కీలకం” అని డైరెక్టర్ అనిల్ రావిపూడి వె స్పష్టం చేశారు.
బాక్సాఫీస్ వద్ద ‘సంక్రాంతి సేవియర్’..
‘మన శంకర వర ప్రసాద్ గారు’ జనవరి 12న (సోమవారం) విడుదలైనప్పటికీ, ఈ చిత్రం దేశీయంగా 11 రోజుల్లో రూ.200 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్క్‌ను దాటినట్లు నిర్మాతలు ప్రకటించారు.
రూ.42 కోట్లు తిరిగి చెల్లించేలా ఆదేశాలు!
ఇదిలా ఉంటే.. ‘మన శంకర వరప్రసాద్’ సినిమాకు టికెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన రూ.42 కోట్లను వసూలు చేయాలని కోరుతూ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ మేరకు పి.శ్రీనివాసరెడ్డి, మరొకరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్, బడ్జెట్ వివరాలు వెల్లడించడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెలితే..
పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. మన శంకర వరప్రసాద్ సినిమా ప్రత్యేక షోకు రూ.600, సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసిందన్నారు. ఈ మెమో ద్వారా సుమారు రూ.42 కోట్ల దాకా అదనంగా వసూలు అయిందన్నారు.
హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా టిక్కెట్ ధరలను పెంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ సంచయ నిధికి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సినిమా నిర్మాతలకు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, పంపిణీదారు దిల్‌రాజు, బుక్ మై షో యాజమాన్యం తదితరులకు నోటీసులు జారీ చేశారు.
Every theatre, every centre..
— Shine Screens (@Shine_Screens) January 19, 2026
Every region and every heart…
THE SWAG KA BAAP has conquered everything 😎
₹292+ crores Gross in the FIRST WEEK for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥
ALL TIME RECORD FOR A REGIONAL FILM 💥💥💥#MegaSankranthiBlockbusterMSG enters into BLOCKBUSTER… pic.twitter.com/AaBGtzHDQh
