శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌ పోలీస్ అవుట్ పోస్ట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్ సంపతి కనకయ్య ఇంట్లో రూ.34 లక్షలు సీజ్‌‌‌‌

శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌ పోలీస్ అవుట్ పోస్ట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్ సంపతి కనకయ్య ఇంట్లో రూ.34 లక్షలు సీజ్‌‌‌‌
  •     ఎస్సై సిద్ధేశ్వర్‌‌‌‌ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు
  •     రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ 2 రోజుల కింద ఏసీబీకి చిక్కిన ఎస్‌‌‌‌ఐ, సీఐ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ పోలీస్ అవుట్ పోస్ట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్ సంపతి కనకయ్య ఇంట్లో రూ.34 లక్షలు పట్టుబడ్డాయి. డబ్బులతో పాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను బుధవారం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కనకయ్య ఇంట్లో లభించిన డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్‌‌‌‌ చేశారు. 

మరో వైపు ఎస్సై సిద్దేశ్వర్‌‌‌‌ ఇంట్లో కూడా ఏసీబీ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు. ఫేక్ పాస్‌‌‌‌పోర్టు కేసులో పట్టుబడిన నిందితుడి నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ సీఐ కనకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్‌‌‌‌ మంగళవారం ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా వీరిద్దరి ఇండ్లలో బుధవారం సోదాలు నిర్వహించారు.