జూబ్లీహిల్స్, వెలుగు: నకిలీ ఐఏఎస్, -ఐపీఎస్ శశికాంత్ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా చార్టర్డ్ అకౌంటెంట్‌ను మోసం చేసి రూ.40 లక్షలు కొట్టేసినట్లు మధురానగర్ పీఎస్‌లో మరో కేసు నమోదైంది.
శ్రీనగర్ కాలనీకి చెందిన కోటేశ్వరరావు చార్టర్డ్ అకౌంటెంట్. మధ్యవర్తి ద్వారా కోటేశ్వరరావుకు పరిచయమైన శశికాంత్ పీఎఫ్, జీఎస్టీ చేయించుకున్నాడు. అనంతరం అప్పుడప్పుడు కోటేశ్వరరావు కార్యాలయానికి అధికారి హోదాలో వస్తూ పోతూ ఉండేవాడు.
ఈ క్రమంలో ఎస్సార్‌నగర్‌లో ప్లాట్ కొనేందుకు కొంత డబ్బు తక్కువగా ఉందని నమ్మించి, 2023 డిసెంబర్ 16న రూ.40 తీసుకున్నాడు. తర్వాత నంబర్లు బ్లాక్ చేసి మిస్సింగ్అయ్యాడు. ఇటీవల శశికాంత్‌ను ఫిలింనగర్ పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించగా, విషయం తెలుసుకొని మధురానగర్పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
