 
                                    హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీసులు 2019 – -2025 ఏడాది మధ్య పట్టుకున్న డ్రగ్స్‌ను గురువారందహనం చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఎడులపల్లి బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ డీసీపీ (డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్) ఎన్. శ్వేత నేతృత్వంలో సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
128 ఎన్డీపీఎస్ కేసుల్లో 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 6.41 గ్రాముల కొకైన్, 1.5 టన్నుల గంజాయి, 4.6 గ్రాముల ఎక్స్‌టసీ పిల్స్, 4,450 ఎమ్‌ఎల్ హాష్ ఆయిల్, 4 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, 159 గ్రాముల ఎండీఎం, 3 నైట్రావెట్ టాబ్లెట్లు, 2 ఓబీసీ పేపర్లను దహనం చేశారు. వీటి విలువ రూ. 4.56,43,930 ఉంటుందని పోలీసులు తెలిపారు.

 
         
                     
                     
                    