డాక్టర్ నిర్లక్ష్యానికి రూ.5.50 లక్షల ఫైన్

డాక్టర్ నిర్లక్ష్యానికి రూ.5.50 లక్షల ఫైన్
  • వినియోగదారుల సలహా కేంద్రంలో ఫిర్యాదు
  • బాధితురాలికి రూ.5.50 లక్షల పరిహారం

హైదరాబాద్‌‌ నగరంలోని ఒక ప్రైవేట్​దవాఖానలో డాక్టర్‌‌తో పాటు సిబ్బంది నిర్లక్ష్యానికి రాష్ట్ర వినియోగదారుల సలహా కేంద్ర ఫైన్​ వేసింది. డాక్టర్ల తీరుతో తీవ్ర అనారోగ్యం , మనోవేదనకు గురైన బాధితురాలికి అండగా నిలిచింది. మూడు నెలల్లో ఉచితంగా కేసును పరిష్కరిం చి డాక్టర్‌‌ నుంచి బాధితురాలికి రూ.5.50 లక్షల పరిహారం ఇప్పించింది. పౌరసరఫరాల భవన్‌ లో పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అకున్‌ సబర్వాల్‌ బాధితురాలికి శనివారం పరిహారాన్ని అందజేశారు. హైదరాబాద్‌‌లోని సైదాబాద్‌‌లో నివసిస్తున్న మరియసబా 2017 డిసెంబర్‌‌లో గర్భం దాల్చింది. అప్పట్నుంచి హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికిలో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేది. ఇదే ఆస్పత్రి లో 2018 సెప్టెంబర్‌‌ 27న డెలివరీ అయింది. ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో డాక్టర్లు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుతూ బాధితురాలు అనారోగ్యానికి గురైందని కుటుంబ సభ్యులకు చెప్పివేరే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు పరీక్షించి యూరిన్‌ , మోషన్‌ ప్యాసేజ్‌ తీవ్రంగా దెబ్బతిన్నదని, తమ దగ్గర వైద్యం చేయడంసాధ్యం కాదని చెప్పారు. వెంటనే బర్కత్‌ పురలోని మరో దవాఖానలో 2018 అక్టోబర్‌‌ 3న చేర్పించారు.వారం రోజుల చికిత్స తర్వాత డిశ్చారి జ చేసి ఆరు నెలలు బెడ్‌ రెస్ట్‌‌ తీసుకోవాలన్నారు. డాక్టర్ నిర్లక్ష్యంపై బాధితురాలి భర్త రాష్ట్ర పౌరసరఫరాల వినియోగాదరుల సలహా కేంద్రాన్ని సంప్రదించారు. తమకు రూ.3 లక్షలకుపైగా ఖర్చైం దని ఫిర్యాదు చేశారు. కేసు పరిశీలించిన వినియోగదారుల కేంద్రం సంబంధిత డాక్టర్‌‌కు నోటీసులు జారీచేసింది. ఇరు వాదనలు విన్నతర్వాత డాక్టర్‌‌ది నిర్లక్ష్యమేనని కేంద్రం గుర్తించింది. తన తప్పును అంగీకరించిన డాక్టర్ బాధితురాలికి రూ. 5.50 లక్షలు అందజేశారు.