కేసీఆర్ .. మీది లీకేజీ,ప్యాకేజీ,డ్యామేజీల ప్రభుత్వం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ ..  మీది లీకేజీ,ప్యాకేజీ,డ్యామేజీల ప్రభుత్వం  : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ సర్కార్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీరు పెట్టే పరీక్షలు లీకేజీ, మీరు కట్టిన కాళేశ్వరం ప్యాకేజీ, నీళ్లనిచ్చే మీషన్ భగీరథ డ్యామేజీ, ఇవన్నీటితో పాటు ఇంకా ప్రారంభం కూడా కానీ  సచివాలయంలో కూడా లీకేజీ అంటూ ట్విట్టర్ లో ఆరోపించారు.   దీనిని బట్టి చూస్తే మీ పాలన లీకేజీ,ప్యాకేజీ,డ్యామేజీల ప్రభుత్వం అని అర్థమవుతుందని విమర్శలు చేశారు.  అందుకే ఇక చాలు గద్దె దిగండి అని ఆయన డిమాండ్ చేశారు. 

బీఎస్పీ పార్టీ ఆఫీసులో కొంతమంది నిరుద్యోగ యువకులు  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిశారు. ఇంటి దొంగలతో నిండిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పూర్తిగా ప్రక్షాళన జరిగేవరకు తమ పోరాటం ఆగేది లేదని ఆయన తేల్చి చెప్పారు.  నిరుద్యోగుల పక్షాన పోరాడుతామని భరోసా కల్పించారు.  చివరి శ్వాస వరకు  విద్యార్థి నిరుద్యోగుల పక్షాన నిలబడుతామని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.