కేసీఆర్, రాజయ్య మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి

కేసీఆర్, రాజయ్య మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ రాష్ట్ర మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని BSP రాష్ట్ర కోఆర్డినేటర్ RS ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మెప్పు పొందేందుకు TRS ప్రజాప్రతినిధులు చెంచాగిరి చేస్తున్నారని విమర్శించారు. ఓ డాక్టర్ అయ్యిండి మహిళలను అవమనపరిచే విధంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. TRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణ మహిళలు చీరలు కడుతున్నట్లు  మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య, ఆయనను ప్రోత్సహించిన సీఎం కేసీఆర్ మహిళ లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. BSP పార్టీ చెంచా గిరి చేసే నాయకులను ప్రోత్సహించదని.. బహుజనుల రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు వెళ్తుందని RS ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.