ఏప్రిల్ 30న ఒకే రోజు మూడు పరీక్షలా..? తేదీలు మార్చండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఏప్రిల్ 30న ఒకే రోజు మూడు పరీక్షలా..? తేదీలు మార్చండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే పోలీస్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, జూనియర్ లైన్ మెన్ పరీక్షలపై బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. పరీక్షల నిర్వహణపై ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఒకే రోజు మూడు పరీక్షలు ఎలా రాస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ సీఎంవో నిరుద్యోగ జీవితాలతో ఆడుకోకుండా పరీక్షల తేదీలను మార్చాలని కోరారు. 

  • ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.
  • పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్‌ వేలిముద్ర తీసుకుంటారు.
  • పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఏదీ ఉండదు.
  • చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలనూ కేంద్రాల్లోకి అనుమతించరు.
  • హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి.