
హైదరాబాద్, వెలుగు: ప్రజా బలం బీఎస్పీ వైపే ఉందని ఆ పార్టీ స్టేట్చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్అన్నారు. కార్యకర్తలు మరో రెండు నెలలు రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ఏనుగుపై ప్రగతి భవన్ కువెళ్లాలని సూచించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన ఎన్నికల నగారా సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాన్షీరామ్ దేశ రాజకీయాలను మలుపుతిప్పిన యోధుడని కొనియాడారు. వచ్చే ఎన్నికలు కొండ చిలువలకు, చలిచీమల మధ్య జరుగుతాయన్నారు.
ఇది కాన్షీరాం కల: రాంజీ గౌతమ్
ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కాన్షీరాం నాటి ఉమ్మడి ఏపీలో బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని కలలు కన్నారని బీఎస్పీ నేషనల్ కో- ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్ అన్నారు. ఆయన కలను నిజం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా, తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అంబేద్కర్ వల్లే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు హక్కులు వచ్చాయని రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్ అన్నారు.