దళితుల భూములను బీఆర్ఎస్ లాక్కుంటోంది

దళితుల భూములను బీఆర్ఎస్ లాక్కుంటోంది

దళితుల భూములు దళితులకు ఇవ్వాలి డిమాండ్ చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్  కుమార్.  70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న 42 ఎకరాల భూమిని లాక్కొని..బాధితులకు 60 గజాల స్థలం ఇస్తానని చెప్పి రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దావత్ ఖాన్ గూడలో  15 రోజులుగా ఆందోళన చేస్తున్న దళిత కుటుంబ సభ్యులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  పరామర్శించారు.  వారికి భరోసా కల్పించారు. 

దేశంలో వందకు 99 శాతం బహుజనలే ఉన్నారని..అగ్ర కులాల వారు ఒక శాతం ఉన్నా..వారి దగ్గరే రాజ్యాధికారం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. దేశంలో ఉన్న భూములన్నీ  ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వంటి భూస్వాముల వద్దే ఉన్నాయని ఆరోపించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల్లో  దళితుల భూములు పంపిణీ చేస్తానని గెలిచిన ఆమె..ఇప్పుడు ప్రభుత్వ అవసరాలకు తీసుకుంటున్నారని..60 గజాల స్థలం ఇస్తామని చెప్పి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.  దళితులను మోసం చేయడమే కాకుండా వారిపై అక్రమ కేసు నమోదు పెడుతున్నారని విమర్శించారు.  దళితులను మోసం చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల ఫోటోలను ఇండ్లలో నుంచి చెత్తకుప్పలో పడేయాలని సూచించారు.