
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశారు. మునుగోడు ఉపఎన్నిక బందోబస్తులో పోలీసుల ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. బందోబస్తులో ఉన్న వేల మంది పోలీసులు అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చలికి వణుకుతూ.. నాసిరకం తిండి తింటూ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. పోలీసులంటే రాజకీయ పార్టీల నాయకులకు అలుసా అని ఆయన అన్నారు.
15 రోజులుగా విధుల్లో ఉన్న వీళ్లకు కనీసం.. టీఏ ఇవ్వడానికి కూడా కేసీఆర్ సర్కార్ దగ్గర డబ్బు లేదా అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అంతకుముందు కూడా మునుగోడులో ఓటర్లను మభ్య పెట్టడానికి.. మందు, డబ్బులు పంచుతున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. పోలీసులను చూస్తే తనకు బాధేస్తుందని అన్నారు. కేసీఆర్ పాలనలో పోలీసులను హీనంగా చూస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.