మిషన్ కర్మయోగికి రూ.86 కోట్లు

మిషన్ కర్మయోగికి రూ.86 కోట్లు

న్యూఢిల్లీ: పర్సనల్ మినిస్ట్రీకి బడ్జెట్ లో రూ.312 కోట్లు కేటాయించారు. ఇందులో ట్రైనింగ్ డివిజన్ కు రూ.105.31 కోట్లు, ట్రైనింగ్ స్కీమ్స్ కోసం రూ.120.56 కోట్లు కేటాయింపులు చేశారు. ఇక సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన ‘మిషన్ కర్మయోగి’కి రూ.86.13 కోట్లు కేటాయించారు.

ట్రైనింగ్ డివిజన్ కింద ఇనిస్టిట్యూట్ ఆఫ్​సెక్రటేరియెట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్ మెంట్ (ఐఎస్ టీఎం), లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ ఎన్ఏఏ) ఉంటాయి. కాగా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) కు రూ.157.72 కోట్లు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ)కు రూ.414.15 కోట్లు కేటాయించారు.