డీపీ చేంజ్ చేసిన ఆర్ఎస్ఎస్

డీపీ చేంజ్ చేసిన ఆర్ఎస్ఎస్

భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియా ఖాతాలకు డీపీగా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే చాలా మంది ప్రముఖులు ఇప్పటికే తమ సోషల్ మీడియా అకౌంట్లకు జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నారు. అయితే తాజాగా ఈ జాబితాలోకి ఆర్ఎస్ఎస్ కూడా వచ్చింది. తమ సోషల్ మీడియా డీపీగా మువ్వన్నెల జెండాను పెట్టుకుంది. అయితే బీజేపీ చెప్పినా ... తమ డీపీగా ఆర్ఎస్ఎస్ ఇప్పటివరకూ త్రివర్ణ పతాకాన్ని ప్రతిపక్షాలు నిన్నటి వరకూ ప్రశ్నిస్తూనే వస్తున్నాయి. 

ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. ఆర్ఎస్ఎస్ తో పాటు, పార్టీ నేతలెవరూ ప్రధాని పిలుపును ఫాలో అవకపోయేసరికి... పలువురు నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో 52 ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదని, దానిని అవమానించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే తాజాగా ప్రతిప‌క్షాల విమ‌ర్శల‌కు పుల్ స్టాప్ పెడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్  తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్ గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, సహా పలువురు బీజేపీ నేతలు కూడా తమ సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకున్న విషయం తెలిసిందే.