
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, ముస్లిం మేధావులతో సమావేశమయ్యారు. గురువారం (జూలై24) హర్యానా భవన్‌లో ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ఈ సమావేశాన్ని నిర్వహించింది.మోహన్ భగవత్ ముస్లిం మత పెద్దలతో జరిపిన సమావేశాలు, దాని పర్యవసానంగా వచ్చిన ప్రశంసలు చర్చనీయాంశంగా మారాయి.
మత సామరస్యం ,విశ్వాసాన్ని పెంపొందించే దిశగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ గురువారం న్యూఢిల్లీలోని హర్యానా భవన్‌లో 50 మందికి పైగా ప్రముఖ ముస్లిం మత పెద్దలు, పండితులతో సమావేశమయ్యారు.మూడున్నర గంటలకు పైగా జరిగిన ఈ రహస్య సమావేశానికి ఆల్-ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి ఆతిథ్యం ఇచ్చారు.
మోహన్ భగవత్ జీతో సానుకూల చర్చలు జరిగాయి.ఈ చర్చలు దేశ ప్రయోజనాల కోసమే జరిగింది. భవిష్యత్తులో కూడా మేం ఇలాంటి సమావేశాలు కొనసాగిస్తామని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి అన్నారు.
ఈ సమావేశంలో ముస్లిం ప్రతినిధులు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల ముందు అనేక అంశాలను లేవనెత్తారు. బుల్డోజర్ చర్యలు, గో రక్షణ పేరుతో ముస్లింలపై హింస, పెరుగుతున్న మూక హత్యాకాండ సంఘటనలు, దుకాణాల సైన్ బోర్డులను మత ప్రాతిపదికన లక్ష్యంగా చేసుకుంటున్న ధోరణిపై చర్చించారు.
ఈ సమస్య చుట్టూ ఉన్న సున్నితత్వాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనేది డిమాండ్ చేశారు. ఈ విషయాలపై చర్య తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి భగవత్ కృష్టి చేయాలని ముస్లిం నాయకులు కోరారు.
శాంతి ప్రేమికుడిగా మోహన్ భగవత్ ..
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడని ఆధ్యాత్మిక,శాంతి ప్రేమికుడైన నాయకుడిగా ముస్లిం పెద్దలు అభివర్ణించారు. భగవత్ నిరంతరం సామరస్యం, పరస్పర గౌరవం కోసం వాదించారు. హిందువులు ,ముస్లింల DNA ఒకటేనని ,ముస్లింల సహకారం లేకుండా భారతదేశాన్ని ఊహించలేమని పేర్కొన్నారు.
ఉత్సాహవంతులైన హిందువులు ప్రతి మసీదు కింద ఆలయం కోసం వెతకకూడదన్న భగవత్ చేసిన వ్యాఖ్యను మౌలానా అబుల్ కలాం ఆజాద్ మేనల్లుడు ఫిరోజ్ బఖ్త్ అహ్మద్ గుర్తుచేసుకున్నారు. కొత్త ,ఏకీకృత భారతదేశ నిర్మాణానికి గతాన్ని సమాధి చేయాలన్న భగవత్ నమ్మకాన్ని సమర్థించాడు. బీజేపీ, ముస్లింలు ఇద్దరూ భారతదేశ భవిష్యత్తులో అంతర్భాగాలని అహ్మద్ నొక్కిచెప్పారు. ముస్లింలకు న్యాయమైన పాలన ,వ్యవస్థ నుంచి నమ్మకం అవసరమని ఆర్ఎస్ఎస్ ముస్లింలలో సద్భావనను పెంపొందించాలని అన్నారు.
ముస్లిం మత పెద్దలు మోహన్ భగవత్‌ను శాంతి ప్రేమికుడుగా, జాతి పితగా ప్రశంసించడం దేశంలో మత సామరస్యం పెంపొందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఒక సంకేతం. ఈ సమావేశాలు, చర్చలు భవిష్యత్తులో వివిధ మతాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్ గత చరిత్ర, ప్రస్తుత వైఖరిపై ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.