బీజేపీ లొల్లిపై ఆర్ఎస్ఎస్ సీరియస్! :  అరుణ్ కుమార్

బీజేపీ లొల్లిపై ఆర్ఎస్ఎస్ సీరియస్! :  అరుణ్ కుమార్
  • నేతలకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ఎస్ జాతీయ నేత అరుణ్ కుమార్ ‘క్లాస్’ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, సోషల్ మీడియా రచ్చపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్) సీరియస్ అయింది. బర్కత్‌‌‌‌‌‌‌‌పురాలోని సంఘ్ స్టేట్ ఆఫీసులో 
శుక్రవారం జరిగిన కీలక భేటీలో బీజేపీ ముఖ్య నేతలతో ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సమావేశమయ్యారు. పార్టీ లీడర్ల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టించుకుంటూ వివాదాలకు తెరలేపడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

బీజేపీ అంతర్గత పంచాయితీలను ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్ దాకా తీసుకురావడం, సంఘ్ పేరును వివాదాల్లోకి లాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 2028 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యమని చెబుతున్న నేతలు.. అందుకోసం మీ దగ్గర ఉన్న అసలు ఎజెండా ఏంటని ప్రశ్నించినట్టు సమాచారం. గ్రూపు రాజకీయాలతో కాలక్షేపం చేయకుండా, ప్రజల్లో పార్టీని ఎలా బలోపేతం చేస్తారో స్పష్టమైన ప్లానింగ్ ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.