- డిజిటల్ అటెండెన్స్కూడా తప్పనిసరి
- గ్రేటర్లో 450 అనధికార డ్రైవింగ్ స్కూల్స్
- కట్టడి చేసేందుకు ఆర్టీఏ నిర్ణయం
- మార్చి 15 నుంచి కొత్త రూల్స్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన మోటార్డ్రైవింగ్స్కూళ్లను కట్టడి చేయాలని ఆర్టీఏ నిర్ణయించింది. ఇక నుంచి మోటార్ డ్రైవింగ్ స్కూల్స్ తప్పని సరిగా ఆన్ లైన్ ద్వారా ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని అధికారులు రూల్పెట్టారు. ప్రస్తుతం గ్రేటర్లో దాదాపు 450 వరకు అనధికార డ్రైవింగ్ స్కూల్స్ ఉండగా, ఆర్టీఏ రికార్డుల్లో మాత్రం కోర్ సిటీలో 240, జీహెచ్ఎంసీ పరిధి లో 550 డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నట్టు చెప్తున్నారు. దీంతో డ్రైవింగ్లైసెన్స్నిర్వాహకులు తప్పనిసరిగా సారథి పోర్టల్ లో నమోదు చేసుకుని సర్టిఫికెట్ పొందాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మార్చి15 నుంచి ఈ కొత్త రూల్అమల్లోకి రానుందని చెప్పారు.
హెవీ మోటార్ డ్రైవింగ్‌కు ఫారం-5 తప్పని సరి
ఎవరైనా హెవీ మోటార్ డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుంటే వారికి ఫామ్–5 సర్టిఫికెట్తప్పనిసరని అధికారులంటున్నారు. దీన్ని ఇక నుంచి మాన్యువల్‌గా తీసుకోమని, సారథి ద్వారానే జారీ చేస్తామంటున్నారు. శిక్షణ పొందుతున్న వారి నుంచి ప్రతి రోజూ డిజిటల్అటెండెన్స్కూడా తీసుకోనున్నారు. ప్రతి జిల్లా పరిధిలో డ్రైవింగ్స్కూళ్ల నిర్వహణను ఎప్పటికప్పుడు సారథి పోర్టల్‌లో నమోదు చేస్తారు. వివరాలిచ్చే డ్రైవింగ్స్కూల్స్సారథిలో లాగిన్అయ్యేందుకు అవకాశం కల్పిస్తారు. స్కూళ్ల రెన్యువల్కూడా పూర్తిగా ఆన్లైన్ద్వారానే చేయనున్నారు
