
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ సేవలకు అంతరాయం ఏర్పడింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా రవాణా శాఖ సర్వర్ డౌన్ కావడంతో ఆర్టీఏ ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. వెహికల్ రిజిస్ట్రేషన్లు, ఇతర వాహన సేవలకు సంబంధించిన లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. దీంతో పబ్లిక్ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.వాహనాల రిజిస్ట్రేషన్, ఇతర పనుల కోసం వచ్చిన జనం ఆర్టీఏ కార్యాలయాల్లో పడిగాపులు కాచారు.
గంటల తరబడి క్యూలో నిలబడి నిరుత్సాహంగా వెనక్కి వెళ్తున్నారు. స్లాట్ బుక్ చేసుకుని ఆఫీస్‌లో లీవ్ పెట్టి వస్తే వృథా అయిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందే సమాచారం ఇస్తే బాగుండేదని అంటున్నారు. వెంటనే అప్రమత్తమైన రవాణ శాఖ అధికారులు సమస్యను గుర్తించి పరిష్కరించారు. టెక్నికల్ ఇష్యూస్ రీస్టోర్ చేసి యధావిధిగా ఆన్ లైన్ సేవలను కొనగిస్తున్నామని తెలిపారు.