- నలుగురికి గాయాలు
చేవెళ్ల, వెలుగు: ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. మెహదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం చేవెళ్ల వైపు వెళ్తుండగా, మల్కాపూర్ స్టేజీ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులోని ఇద్దరికీ ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలయ్యాయి. అటు 30 మంది ప్రయాణికులతో ఉన్న బస్సులో డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్న మరో ఇద్దరు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్దే తప్పని ప్రాథమికంగా నిర్ధారించినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తేజశ్రీ తెలిపారు.
