
కామారెడ్డి దగ్గర మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు మహారాష్ట్ర నాంధేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా టేక్రియాల్ వద్ద బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ఉన్నారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.