
మరో ఆర్టీసీ కార్మికుడు అమరుడయ్యాడు. వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన కండక్టర్ రవీందర్ కు మొన్న గుండెపోటు వచ్చింది. సమ్మె నేపథ్యంలో ఎదురైన విపరీత ఒత్తిడులతో రవీందర్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయన్ని హైదరాబాద్ లోని మెడికవర్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. చికిత్స పొందుతూ ఈ అర్థరాత్రి తర్వాత కన్నుమూశారు.
రవీందర్ మృతదేహాన్ని తెల్లవారుజామున ఆత్మకూరుకు తరలించారు పోలీసులు. రవీందర్ ఇంటికి కార్మికులంతా చేరుకోవాలని జేఏసీ పిలుపునివ్వడంతో ఆత్మకూరులో భారీగా పోలీసులు మోహరించారు. రవీందర్ ఇంటిదగ్గర పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.