
- పార్టీల నేతలకు జేఏసీ ఇన్విటేషన్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 16న “ హైదరాబాద్లో దశాబ్ది ఉత్సవాలు- ఆర్టీసీ పరిస్థితి, కార్మికుల పని” అనే అంశంపై రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్కు అన్ని పార్టీల నేతలను జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి ఆహ్వానించారు. గురువారం జూబ్లీహిల్స్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి మీటింగ్కు రావాలని రాజిరెడ్డి కోరారు.
ఈ సందర్భంగా మీటింగ్కు వస్తానని రేవంత్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, ఆప్, వైఎస్సార్‌టీపీ, ఏఐటీయూసీల్లో ఇన్విటేషన్లు ఇచ్చినట్లు తెలిపారు.