మేడిపల్లి, వెలుగు: ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు షటిల్ బస్ సర్వీసులను ప్రారంభించినట్లు ఆర్టీసీ చెంగిచర్ల డిపో మేనేజర్ కె.కవిత తెలిపారు. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు నగరంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా చేరేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్ వరకు ఈ షటిల్ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12.20 గంటల నడుస్తాయని తెలిపారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా షెడ్యూల్ రూపొందించామని చెప్పారు.

