
హైదరాబాద్, వెలుగు: కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం సర్క్యూలర్ విడుదల చేశారు. మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోనున్నారు. 2019 నుంచి పెండిం గ్‌లో ఉన్న నియామకాలను భర్తీ చేయా లని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉద్యోగి మరణించిన తేదీ ఆధారంగా సీనియారిటీని అనుసరించి నియా మకాలుంటాయని తెలిపారు. ఉద్యోగి కుటుంబ సభ్యుల అర్హతలను అనుస రించి డ్రైవర్ గ్రేడ్ - 2, కండక్టర్ గ్రేడ్-2, ఆర్టీ సీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మూడేళ్ల పనితీరు ఆధా రంగా వారిని రెగ్యులర్ చేయనున్నారు.