ప్రభుత్వ ఆదేశాల మేరకే అద్దె బస్సుల కొనసాగింపు : ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

ప్రభుత్వ ఆదేశాల మేరకే అద్దె బస్సుల కొనసాగింపు : ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీకి సేవలందిస్తున్న అద్దె బస్సుల కొనసాగింపు, నిర్వహణ అనేది ప్రభుత్వ ఆదేశాల మేరకే ఉంటుందని సంస్థ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అద్దె బస్సుల విషయంలో యజమానులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు.

యజమానుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరు.. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సంస్థ నియమ, నిబంధనలే ప్రామాణికమని, ఈ విషయంలో ఎలాంటి పైరవీలకు తావులేదని తెలిపారు.