
- సీఎంకు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్‌యూనియన్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌పాలన పోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆర్టీసీలో ఇంకా కేసీఆర్మార్క్పాలనే కొసాగుతోందని ఆర్టీసీ స్టాఫ్అండ్వర్కర్స్యూనియన్ ఆరోపించింది. వెంటనే వెల్ఫేర్కమిటీలను రద్దు చేసి యూనియన్లకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరింది. గురువారం యూనియన్ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి, అడిషనల్ ప్రధాన కార్యదర్శి అబ్రహం, గోపాల్, యూనియన్‌సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు.
.ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్‌చేసినా, ఇంత వరకూ విలీనం జీవో ఇవ్వలేదన్నారు. 2017, ఏప్రిల్‌నుంచి 16 శాతం ఐఆర్తోనే వేతనాలు చెల్లిస్తున్నారని, ఫిట్మెంట్ఇవ్వలేదని వాపోయారు. కోఆపరేటివ్సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మహాలక్ష్మి పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని, పథకం కోసం మరిన్ని కొత్త బస్సులు కొనాలని చెప్పారు