
ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని డాక్టర్ శంకర్ ప్రజా ఆస్పత్రి బిల్డింగ్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం సీజ్ చేశారు. ముషీరాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ దేవేందర్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. సెల్లార్, జీ+4 పేరుతో జీహెచ్‌ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకుని అదనపు సెల్లార్ తోపాటు, మరో రెండు అంతస్తులు అదనంగా నిర్మించారని ఏసీపీ దేవేందర్తెలిపారు. ఈ విషయంపై స్థానికులు కోర్టు వెళ్లారని, కోర్టు ఆదేశాలతో బిల్డింగ్‌లోని ఐదు, ఆరు అంతస్తులు, సెల్లార్ సీజ్ చేశామని పేర్కొన్నారు.