ఆర్టీఐ కార్యకర్తకు విచిత్రమైన జవాబు..ఎండ్లబండిపై వెళ్లి తీసుకుండు

ఆర్టీఐ కార్యకర్తకు విచిత్రమైన జవాబు..ఎండ్లబండిపై వెళ్లి తీసుకుండు

రూ.25వేలు అప్పు చేసి మరీ అప్లికేషన్​
మధ్యప్రదేశ్​లోని శివ్​పురిలో ఘటన

శివ్​పురి(మధ్యప్రదేశ్): ప్రధాన్​ మంత్రి ఆవాస్​ యోజన(పీఎంఏవై)లో జరిగిన అవకతవకలపై ఓ ఆర్టీఐ కార్యకర్త 9,000 పేజీల ఇన్​ఫర్మేషన్​ పొందాడు. దీని కోసం అతను ఏకంగా రూ.25వేలు అప్పు చేశాడు. 9వేల పేజీలు తీసుకునేందుకు ఎండ్లబండిపై డ్రమ్స్​ వాయించుకుంటూ మున్సిపల్​ ఆఫీస్​కు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నది.

మధ్యప్రదేశ్, శివ్​పురి జిల్లాలోని బైరాద్​ టౌన్​కు చెందిన మఖన్​ ధాకడ్​ ఆర్టీఐ యాక్టివిస్ట్. పీఎంఏవై స్కీంలో అవినీతి జరిగినట్టు తెలుసుకున్నాడు. స్కీంకు సంబంధించిన సమాచారం కోసం 2 నెలల కింద ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. రూ.25 వేలు కడితేనే ఇన్​ఫర్మేషన్​ ఇస్తామని మున్సిపల్​ అధికారులు చెప్పారు. అప్పు తెచ్చి మరీ రూ.25వేలు కట్టాడు. అయినా అధికారులు సతాయించారు.

దీంతో ధాకడ్​, డైరెక్ట్​గా గ్వాలియర్​లోని అర్బన్​ అడ్మినిస్ట్రేషన్​ డిపార్ట్​మెంట్​ అధికారులను కలిశాడు. వెంటనే ధాకడ్​ అడిగిన ఇన్​ఫర్మేషన్​  ఇవ్వాలంటూ మున్సిపల్​ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అప్పుడు గానీ మఖన్​కు 9,000 పేజీల ఇన్​ఫర్మేషన్​ లభించలేదు.