రూ. 499కే ఆర్టీపీసీఆర్ టెస్ట్.. గంటన్నరలోనే రిజల్ట్

రూ. 499కే ఆర్టీపీసీఆర్ టెస్ట్.. గంటన్నరలోనే రిజల్ట్

గంటన్నరలోనే రిజల్టొస్తది

ఇక ఫాస్ట్‌గా ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు

రూ. 499కే టెస్ట్ చేస్తరు 

డ్రైస్వాబ్ మెథడ్ పై సీసీఎంబీ, స్పైస్ హెల్త్ కంపెనీ ఎంవోయూ

ఇప్పటికే ఢిల్లీలో  5 ల్యాబ్ లు ప్రారంభం

తార్నాక (హైదరాబాద్), వెలుగు: కొత్త టెక్నాలజీతో కరోనా టెస్టులు చేసేందుకు హైదరాబాద్ లోని సీసీఎంబీ, స్పైస్ హెల్త్ కంపెనీ సోమవారం ఎంవోయూ కుదుర్చుకున్నాయి. సీసీఎంబీ అభివృద్ధి చేసిన డ్రైస్వాబ్ ఆర్టీపీసీఆర్ మెథడ్ ను ఉపయోగించి స్పైస్ హెల్త్ కంపెనీ ఇప్పటికే తన మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ లలో ఆర్టీపీసీఆర్ టెస్టులను చేస్తోంది. త్వరలో మరిన్ని ల్యాబ్ లలో ఈ మెథడ్ తో టెస్టులు చేయనుంది. దీనికి సంబంధించి రెండు సంస్థల మధ్య ఎంవోయూ కుదిరింది. గత కొన్ని వారాలుగా స్పైస్ హెల్త్ కంపెనీ ఢిల్లీ ఎన్ సీఆర్ పరిధిలో 5 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ లను ప్రారంభించింది. వీటిద్వారా రోజూ 10 వేల మందికి టెస్టులు చేస్తున్నారు. వచ్చే రెండు వారాల్లో మరో 10 ల్యాబ్ లను ప్రారంభించనున్నట్లు కంపెనీ సీఈవో అవని సింగ్ చెప్పారు. ఒక్కో టెస్టుకు రూ. 499 మాత్రమే అవుతుందని, అందరికీ అందుబాటులో ఉండేలా ధరను నిర్ణయించామన్నారు. ఈ పద్ధతిలో కేవలం గంటన్నరలోనే రిజల్ట్ వస్తుందని, దేశంలో ఈ టెక్నాలజీని వాడుతున్న ఫస్ట్ కంపెనీ తమదేనన్నారు. సీసీఎంబీతో ఎంవోయూ ద్వారా తాము మరింత వేగంగా, చౌకైన కరోనా టెస్టులు చేయగల్గుతున్నామని, అందరికీ అందుబాటు ధరల్లోనే క్వాలిటీ టెస్టులు చేస్తామన్నారు.

‘డ్రైస్వాబ్’తో ఫాస్ట్ గా రిజల్ట్.. 

సీసీఎంబీ రూపొందించిన డ్రై స్వాబ్ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ మెథడ్ ను ఐసీఎంఆర్ గత నెలలోనే ఆమోదించింది. మామూలు ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం సేకరించే స్వాబ్ శాంపిళ్లను ప్రత్యేక సొల్యూషన్ లో ఉంచి ల్యాబ్ కు తరలించాల్సి ఉండటంతో చాలా ఇబ్బందులు వచ్చేవి. వాటిని ల్యాబ్ కు పంపేందుకు కూడా చాలా టైం పట్టేది. అయితే డ్రైస్వాబ్ మెథడ్ లో శాంపిళ్లను ప్రత్యేక సొల్యూషన్ లో ఉంచి, ల్యాబ్ కు తరలించాల్సిన అవసరం లేదు. శాంపిల్ సేకరించిన వెంటనే మొబైల్ ల్యాబ్ లో టెస్టు చేసేందుకు వీలవుతుంది. ఈ పద్ధతితో అటు సమయం, ఇటు ఖర్చు కూడా తగ్గుతుందని, అదే సమయంలో టెస్ట్ రిజల్ట్ కూడా కచ్చితత్వంతో వస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు.

For More News..

రైతుల సబ్సిడీ యూరియా దారిమళ్లింపు

గెస్ట్ లెక్చరర్లకు ఇంటెలిజెన్స్ వర్గాల ఫోన్లు

టీఎస్‌‌‌‌పీఎస్సీ చైర్మన్ రేసులో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌లు