రన్నింగ్ కారులో మంటలు

రన్నింగ్ కారులో మంటలు

శంషాబాద్, వెలుగు: రన్నింగ్​కారులో మంటలు చెలరేగిన ఘటన శంషాబాద్ ఎయిర్​పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎయిర్​పోర్ట్ ఔట్ పోస్ట్ ఇన్​స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బెంజ్​కారు ఆదివారం శంషాబాద్​ఎయిర్ పోర్ట్ కు వెళ్తోంది. సీఐఎస్ఎఫ్ చెక్​పోస్ట్ వద్దకు రాగానే  ఇంజిన్ లో నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్​శ్రీకాంత్​కారును పక్కకు ఆపి, ప్రాణాలు కాపాడుకున్నాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కారు సగానికి పైగా దగ్ధమైనట్లు తెలిపారు.  కేసు నమోదు చేసినట్లు ఇన్​స్పెక్టర్ పేర్కొన్నారు.