గండిపేట, వెలుగు: రన్నింగ్ కారు నుంచి క్రాకర్స్ కాలుస్తూ పోకిరీలు హంగామా సృష్టించారు. స్పీడ్‌గా వెళ్తున్న కారులోంచి రాకెట్ క్రాకర్స్ గాలిలోకి వదులుతూ హైవేపై వెళ్లేవారిని భయబ్రాంతులకు గురిచేశారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో షౌక్ అబ్దుల్ రజాక్, అబ్దుల్ సమీ, సయ్యద్ మోషిన్ అనే యువకులు కారులో ఆరామ్‌ఘర్ నుంచి అంబర్‌పేట్ వైపు వెళ్తున్నారు. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే ఉప్పర్ పల్లి వద్ద కారులో నుంచి రాకెట్ క్రాకర్స్ కాల్చి బయటికి వదులుతూ హల్చల్ చేశారు. రాజేంద్రనగర్ ఎస్‌హెచ్‌వో సీహెచ్.రాజు వారిని ట్రేస్ చేసి పట్టుకున్నారు.
