కొనసాగుతున్న రూపాయి పతనం

కొనసాగుతున్న రూపాయి పతనం

న్యూఢిల్లీ: రూపాయి విలువ బుధవారం మరింత పతనమైంది. డాలర్ బలపడడంతో పాటు దేశ మార్కెట్‌‌‌‌ల నుంచి విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు వెళ్లిపోతుండడంతో బుధవారం రూపాయి విలువ మొదటి సారిగా 79 ని క్రాస్ చేసింది. 79.04 దగ్గర ఆల్‌‌టైమ్ కనిష్టాన్ని రికార్డ్ చేసింది. డాలర్ మారకంలో రూపాయి బుధవారం 78.86 వద్ద ఓపెన్ అయ్యింది. ‘మాంద్యం మంచిది కాదని ఈక్విటీ మార్కెట్‌‌లు నిర్ణయించుకున్నాయి. దీంతో కిందటి వారం వచ్చిన నష్టాలన్నిటినీ డాలర్ ఒకే సెషన్‌‌లో కవర్ చేసుకోగలిగింది. డాలర్ మారకంలో యెన్ (జపనీస్ కరెన్సీ) ఎక్స్చేంజిల్లో తిరిగి 136 పైకి చేరుకుంది.  దేశ రూపాయి ఆల్‌‌టైమ్ కనిష్టాలకు పడిపోయింది’ అని ఓండా ఆసియా పసిఫిక్‌‌ సీనియర్ మార్కెట్ ఎనలిస్ట్ జెఫరీ హేలీ అన్నారు. ‘యూస్‌‌ బాండ్ ఈల్డ్‌‌లు కిందటి రాత్రి పెద్దగా పెరగలేదు. రూపాయి, యెన్ విలువ పడడానికి బాండ్‌‌ ఈల్డ్‌‌లు కారణం కాదని తెలుస్తోంది. దీన్ని బట్టి సమస్య కనిపించగానే మార్కెట్‌‌లు సేఫ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్ అయిన డాలర్ వైపు పరుగులు తీస్తున్నాయని అర్థమవుతోంది’ అని వివరించారు.