జీవితకాల కనిష్టానికి రూపాయి పతనం

జీవితకాల కనిష్టానికి రూపాయి పతనం

డాలర్తో పోలిస్తే రూపాయి పతనం కొనసాగుతోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి చేరింది. ఉదయం సెషన్ లో 16 పైసలు తగ్గిన రూపాయి విలువ ఒక దశలో 82.33కు చేరింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ఇది. 0.25శాతం తక్కువ. అమెరికాలో ఉద్యోగ గణాంకాలు నిరాశాజనకంగా ఉంటే ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును మంరిత వేగవంతం చేసే అవకాశముందన్న అంచనాలతో డాలర్ మరింత బలపడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి విలువ 10శాతం పతనంమైంది. 

డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకూ దారుణంగా పడిపోతుండటం భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా వాణిజ్య లోటు మరింత పెరగనుంది. దిగుమతులు భారంగా మారనున్నాయి. రూపాయి పతనం కొనసాగితే ఉన్నత విద్య కోసం తమ పిల్లల్ని అమెరికా పంపాలనుకుంటున్న తల్లిదండ్రుల  కలలు కల్లలుగానే మిగిలిపోనున్నాయి.