మృగశిర కార్తె సందర్భంగా గురువారం(జూన్ 09) తెల్లవారుజాము నుంచే గ్రేటర్సిటీలోని చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. అతిపెద్దదైన రాంనగర్చేపల మార్కెట్ కు జనం పోటెత్తారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు అనేక రకాల చేపలను అందుబాటులో ఉంచారు. కిలో కొర్రమీను రూ.500 నుంచి 600 వరకు, రవ్వు, బొచ్చె చేపలను రూ.120 నుంచి150 వరకు విక్రయించారు. – వెలుగు, ముషీరాబాద్/శంకరపల్లి

