అంతరిక్ష యుద్ధం : నాసా శాటిలైట్ కు. 10 మీటర్ల దూరంలో దూసుకెళ్లిన రష్యా ఉపగ్రహం

అంతరిక్ష యుద్ధం : నాసా శాటిలైట్ కు. 10 మీటర్ల దూరంలో దూసుకెళ్లిన రష్యా ఉపగ్రహం

అమెరికా, రష్యా అంటే ఉప్పూ నిప్పుగా ఉంటాయి.. అది భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ అనటానికి లేటెస్ట్ గా జరిగిన ఓ ఘటనే నిదర్శనం.. అంతరిక్షంలో అమెరికా నాసాకు చెందిన శాటిలైట్ కు.. కేవలం 10 మీటర్ల దూరం నుంచి రష్యా ఉపగ్రహం ఒకటి దూసుకెళ్లింది. రెండు ఉపగ్రహాలకు ఏమీ కాకపోయినా.. ఇప్పుడు అది రెండు దేశాల మధ్య హాట్ టాపిక్ అయ్యింది. పది అంటే 10 మీటర్ల గ్యాప్ లో రష్యా ఉపగ్రహం.. నాసాకు చెందిన శాటిలైట్ మీదుగా వెళ్లటం ద్వారా .. ఇది కావాలని చేశారా లేక యాధృశ్చికంగా జరిగిందా అనేది చర్చనీయాంశం అయ్యింది.

రష్యా ఉపగ్రహం అంతరిక్షంలోకి 10 మీటర్ల దూరంలోకి రావడంతో అమెరికన్ ఉపగ్రహం తృటిలో ప్రమాదం  తప్పిపోయింది.   నాసా శాటిలైట్ కు,  రష్యా ఉపగ్రహం ఢీకొన్నట్లైతే పెద్ద ప్రమాద ముప్పు  ఉండేదని నిపుణులు చెబుతున్నారు.  నిజంగా ఆందోళన చెందామని  నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్, కల్నల్ పామ్ మెల్రాయ్  చెప్పారు. 

భూమి  వాతావరణాన్ని పర్యవేక్షించే నాసా యొక్క టైమ్డ్ (థర్మోస్పియర్ ఐయోనోస్పియర్ మెసోస్పియర్ ఎనర్జిటిక్స్ అండ్ డైనమిక్స్) ఉపగ్రహం,  రష్యా గూఢచారి ఉపగ్రహం కాస్మోస్ 2221 ద్వారా దాదాపుగా ధ్వంసమై  ఉండేదన్నారు.  10 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉందని తాము ఇటీవలే తెలుసుకున్నాము. రెండు ఉపగ్రహాలు ఢీకొన్నట్లయితే, శిధిలాల ఉత్పత్తి, చిన్న చిన్న ముక్కలు గంటకు 10 వేల  మైళ్ల వేగంతో ప్రయాణించేవని చెప్పారు.  ఇది మానవ ప్రాణాలకు  ప్రమాదంగా మారే అవకాశముండేదన్నారు. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యొక్క రష్యన్ విభాగం నుంచి  గాలి లీక్ అవుతున్నట్లు రష్యా అంతరిక్ష అధికారులు ఏప్రిల్ 12న అంగీకరించారు, అయితే దాని సిబ్బందికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. నిపుణులు లీక్‌ను పర్యవేక్షిస్తున్నారని రోస్కోస్మోస్ స్టేట్ కార్పొరేషన్ తెలిపింది.