రష్యా చేసేది నరమేధమే..

రష్యా చేసేది నరమేధమే..

వాషింగ్టన్: ఉక్రెయిన్ పై సైనికచర్యకు దిగిన రష్యాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ లో రష్యా సైనికులు అరాచకాలు చేస్తున్నారని.. దీన్ని నరమేధంతో పోల్చారు. రష్యా దాడులు చేసి వెనుదిరిగిన తర్వాత ఆయా నగరాల్లో భయానక దృష్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్ తీవ్రంగా స్పందించారు. ఉక్రెయిన్ లో రష్యా నరమేధం చేస్తోందని.. అసలు ఉక్రెయిన్ ఉన్నదనే ఆలోచనను కూడా కూకటివేళ్లతో పెకిలించేయాలని పుతిన్ ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. చాలా కొత్త ఆధారాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. 

ఉక్రెయిన్ మీద రష్యా దళాల చర్యలను యుద్ధ నేరాలుగా పరిగణించాలని గతంలో బైడెన్ చెప్పారు. ఉక్రెయిన్ క్రైసిస్ పై యూఎస్ పాలసీలో వేగంగా మార్పులు చేస్తున్నామని తెలిపారు. బైడెన్ స్పందనకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ నుంచి మద్దతు లభించింది. నిజమైన నాయకుడి నిజమైన వ్యాఖ్యలు అని.. అమెరికా సాయానికి కృతజ్ఙతతో ఉంటామన్నారు. రష్యన్లను అడ్డుకోవడానికి మరిన్ని భారీ ఆయుధాలు కావాలన్నారు.  

మరిన్ని వార్తల కోసం:

ఇకపై లంచ్ బ్రేక్ అరగంటే..

ఎల్లుండితో డెడ్ లైన్ క్లోజ్ 

రాష్ట్రంలో మండుతున్న ఎండలు