రాష్ట్రంలో మండుతున్న ఎండలు 

రాష్ట్రంలో మండుతున్న ఎండలు 

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే.. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో ఎండలు విపరీతంగా ఉంటాయని.. వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలకు బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బతో పాటు డీహైడ్రేషన్ ప్లాబ్లమ్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలామంది మధ్యాహ్నం టైమ్ లో ఇంటిపట్టునే ఉండేందుకు ప్రిపరెన్స్ ఇస్తున్నారు.

ఇక ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు.. కొబ్బరిబోండాలు, కూల్ డ్రింక్స్, చెరుకు రసం, లస్సీ, ఫ్రూట్ జ్యూస్ లు తాగుతున్నారు. సమ్మర్ స్పెషల్ అయిన వాటర్ మిలాన్ ను ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు. నాటు, హైబ్రీడ్ రకాల పుచ్చకాయలు మార్కెట్ లో దొరుకుతుండటంతో.. ఎగబడి కొంటున్నారు. మరోవైపు ఎండల తీవ్రతకు.. ప్రజలు.. ఏసీలు, కూలర్ల నుంచి కదిలే పరిస్థితి లేదు. దీంతో.. ఏసీ, కూలర్ వ్యాపారులకు డిమాండ్ బాగా పెరిగింది. అటు మట్టి కుండల బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. ఫ్రిజ్ లో నీళ్లు ఇష్టంలేని వాళ్లు.. మంటి కుండలపై ఆసక్తి చూపిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

 

ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిపిస్తే.. మిగతా వాళ్లు లస్సీ తాగడానికి వెళ్లారా?

వారం పాటు టీటీడీ బ్రేక్ దర్శనాలు రద్దు