ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిపిస్తే మిగతా వాళ్లు లస్సీ తాగడానికి వెళ్లారా?

ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిపిస్తే మిగతా వాళ్లు లస్సీ తాగడానికి వెళ్లారా?

ముంబై: వన్డే ప్రపంచకప్ (2011)లో ఇండియా టీమ్ విజేతగా నిలవడంలో ఎక్కువ క్రెడిట్​ ఎంఎస్ ధోనీ ఒక్కడికే ఎందుకు ఇస్తున్నారని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. క్రికెట్ అనేది టీమ్ గేమ్ అని స్పష్టం చేశాడు. ‘ఆస్ట్రేలియా జట్టు కనుక వరల్డ్ కప్ గెలిస్తే ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలిచింది అని అంటారు. కానీ ఇండియా గెలిస్తే ధోనీనే ప్రపంచకప్ గెలిపించాడు అంటారు. అలాంటప్పుడు మిగతా 10 మంది ప్లేయర్లు లస్సీ తాగడానికి అక్కడికి వెళ్లారా?  వాళ్లంతా ఏం చేసినట్టు? టోర్నీలో గొప్పగా ఆడిన గౌతమ్ గంభీర్ ఏం చేసినట్టు?  క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ టీమ్ గేమ్.  7, 8 మంది ప్లేయర్లు రాణించినప్పుడే  ఓ జట్టు విజయం సాధిస్తుంది’ అని  హర్భజన్ వ్యాఖ్యానించాడు.