ఎల్లుండితో డెడ్ లైన్ క్లోజ్ 

ఎల్లుండితో డెడ్ లైన్ క్లోజ్ 

పెండింగ్ చలానాలపై సర్కార్ రాయితీకి గడవు ముగుస్తోంది. ఎల్లుండితో ఈ డెడ్ లైన్ క్లోజ్ కానుంది. దీంతో పెండింగ్ చలాన్లు చెల్లించని వారు త్వరపడాలని సూచిస్తున్నారు పోలీసులు. ముందుగా మార్చి 1 నుంచి 31 వరకు ఆఫర్ ప్రకటించారు పోలీసులు... ఆ తర్వాత దీన్ని మరో 15 రోజులు పెంచి ఏప్రిల్ 15 వరకు చలానాలు చెల్లించేలా గడువు ఇచ్చారు. అయితే గడువు ముగిసే లోపు చలానాలు చెల్లించకుంటే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. 

ట్రాఫిక్ చలానాలపై సర్కార్ రాయితీ ఇవ్వటంతో... ఇప్పటి వరకు క్లియర్ చేసిన వారి సంఖ్య 2 కోట్ల 90 లక్షలకు చేరుకుంది. దీంతో రాష్ట్ర సర్కార్ కు దాదాపు 292 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరో వంద కోట్ల వరకు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే పెండింగ్ చలాన్లు భారీగా ఉండటంతో వాహనదారులను  అలర్ట్ చేస్తున్నారు అధికారులు. సర్కార్ ఇచ్చిన అవకాశాన్ని సద్వీనియోగం చేసుకోవాలంటున్నారు. గడువు ముగిసిన తర్వాత ముక్కుపిండి మరి వసూల్ చేస్తామని చెబుతున్నారు.  పెండింగ్ చలానాలపై స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తామని తెలుపుతున్నారు.