ఇకపై లంచ్ బ్రేక్ అరగంటే..

ఇకపై లంచ్ బ్రేక్ అరగంటే..

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో రెండోమారు అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులకు లంచ్ బ్రేక్ సమయాన్ని తగ్గించారు. ఇప్పటివరకు లంచ్ బ్రేక్ కు గంట సమయం ఉండగా.. దాన్ని తాజాగా అరగంటకు తగ్గించారు. లంచ్ బ్రేక్ కు ఎక్కువ సమయాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకు సాయం చేసే సమయం ఇంకా పెరుగుతుందని యోగి తెలిపారు. ప్రజావసరాలను తీర్చేందుకే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పారు. పాల‌నలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకురాబోతున్న‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల‌కు ఉచితంగా ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు అంద‌జేస్తున్నామ‌ని అన్నారు. అలాగే రాష్ట్రంలో 75 చెరువుల పూడిక‌ల‌ను కూడా తీస్తామ‌ని ప్ర‌క‌టించారు.

మరిన్ని వార్తల కోసం:

ఎల్లుండితో డెడ్ లైన్ క్లోజ్ 

రాష్ట్రంలో మండుతున్న ఎండలు 

ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిపిస్తే.. మిగతా వాళ్లు లస్సీ తాగడానికి వెళ్లారా?