Ruturaj Gaikwad : న్యూజిలాండ్ టీ20 సిరీస్ నుంచి రుతురాజ్ ఔట్

Ruturaj Gaikwad : న్యూజిలాండ్ టీ20 సిరీస్ నుంచి రుతురాజ్ ఔట్

న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మణికట్టుకు గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠీలతో పాటు మరికొందరిని బీసీసీఐ రాంచీకి తీసుకెళ్లింది. అయితే, రుతురాజ్ స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. 

ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్ లో రుతురాజ్ గాయపడినట్లు తెలుస్తుంది. రంజీల్లో రెచ్చిపోయి ఆడిన రుతురాజ్ ఈ సిరీస్ లో లేకపోవడం టీమిండియాకు లోటు అనే చెప్పొచ్చు. శుక్రవారం నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్ కు కెప్టెన్ గా  హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు.