V6 News

సౌతాఫ్రికా టూర్లో మళ్లీ ఓడిన అమ్మాయిలు

సౌతాఫ్రికా టూర్లో  మళ్లీ ఓడిన అమ్మాయిలు

డర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సౌతాఫ్రికా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా అమ్మాయిలు మరోసారి నిరాశపరిచారు. వరుసగా రెండో టీ20లోనూ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీమ్ చేతిలో ఓడిపోయారు.  ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఆదివారం జరిగిన టీ20లో ఇండియా 8 వికెట్ల తేడాతో సఫారీ టీమ్ చేతిలో చిత్తయింది.  

తొలుత టీమిండియా 20 ఓవర్లలో 147 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఓపెనర్ షెఫాలీ వర్మ (57) ఫిఫ్టీతో ఒంటరి పోరాటం చేసింది. అనుష్క శర్మ (28) మెప్పించినా  మంధాన (12), జెమీమా (2), హర్మన్ (12), దీప్తి శర్మ (1), రిచా (3) ఫెయిలయ్యారు. సఫారీ బౌలర్లలో క్లోయి ట్రైయన్ (3/22),  టుమి సెఖుఖునె (3/31) చెరో మూడు వికెట్లతో దెబ్బకొట్టారు. అనంతరం సునె లూస్ (57),  వోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వార్ట్ (54) ఫిఫ్టీలతో విజృంభించడంతో సౌతాఫ్రికా 17.1 ఓవర్లలో 148/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ట్రైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో టీ20 బుధవారం జరుగుతుంది.