వరుసగా నాలుగోసారి.. ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‎కు సబలెంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పెగులాతో టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరుసగా నాలుగోసారి.. ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‎కు సబలెంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పెగులాతో టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మెల్​బోర్న్: బెలారస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరీనా సబలెంక వరుసగా నాలుగోసారి ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమీఫైనల్లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబలెంక 6–2, 6–3తో 12వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలిచింది. ఫలితంగా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎరాలో వరుసగా నాలుగుసార్లు మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరిన మూడో ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కింది. ఎవోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గులగాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మార్టినా హింగిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందున్నారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆమెకు ఇది ఎనిమిదో గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. 

2023, 2024లో ఒక్క సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కోల్పోకుండా ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన సబలెంక ఈసారి కూడా దాన్ని పునరావృతం చేసింది. ఇక డబ్ల్యూటీఏ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్వితోలినాపై తన రికార్డును 6–1కి మెరుగుపర్చుకుంది.  2023 నుంచి హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన గత ఏడు గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ సబలెంక ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకోవడం విశేషం. గంటా 16 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యలో సబలెంక ఆటకు ఆటంకం (హిండ్రెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కలిగించిందని  ఓ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెనాల్టీని విధించారు. 

అయినప్పటికీ  బలమైన సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, పదునైన రిటర్న్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంది. 29 విన్నర్లతో చెలరేగింది. తన సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 69 శాతం పాయింట్లు రాబట్టింది. ఒకే ఒక్క డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఆమె 15 అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఏడు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో నాలుగింటిని కాచుకుంది. స్వితోలినా 17 అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 12 విన్నర్లతో 56 శాతం పాయింట్లే రాబట్టింది. 3 డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2 ఏస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొట్టింది. 

మరో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలినా రిబకినా (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 6–3, 7–6 (9/7)తో ఆరోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెస్సికా పెగులా (అమెరికా)పై నెగ్గింది. గంటా 40 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈజీగా గెలిచిన రిబకినాకు రెండో సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గట్టి పోటీ ఎదురైంది. టైబ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బలమైన సర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో చెలరేగి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాపాడుకుంది. 6 ఏస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొట్టిన రిబకినా ఒక్క డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా చేయలేదు. 31 విన్నర్లతో 73 శాతం పాయింట్లతో పూర్తి ఆధిపత్యం చూపెట్టింది.  29 అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా నాలుగు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లను కాచుకుంది.