ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ అన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో 9 లక్షల 20 వేల సీసీ కెమెరాల ఏర్పాటు చేశామన్నారు.   సీసీ కెమెరాల సాంకేతికతతో రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గిందన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో .. TSIIC ద్వారా 2 కోట్లు 91లక్షల నిధులతో 284 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లెలగూడలోని SYR కన్వెన్షన్ లో సీసీ కెమెరాలను డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని.. మీర్ పేట్, బాలాపూర్, పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.