
రాష్రంలోఉన్న అన్ని యునివర్సిటీల రిజిస్టర్లతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను తొందరలోనే భర్తీ చేస్తామని అన్నారు. వీలయినంత తొందరలోనే వీసీలు యునివర్సిటీలకు వస్తారని చెప్పారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగునంగా ఉన్నతవిద్యలోమార్పురావాలని చెప్పారు. ప్రభుత్వం నుంచికూడా సహాయ సహకారాలను తీసుకుందామని చెప్పారు. ఇకపై ఆన్ లైన్ లోనే అడ్మిషన్లను జరుగుతాయని తెలిపారు మంత్రి.