ఫార్ములా ఈ రేసింగ్కు సచిన్, చాహల్, ధావన్

ఫార్ములా ఈ రేసింగ్కు సచిన్, చాహల్, ధావన్

ఇండియాలో రేసింగ్‌ ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన ఈ రేసింగ్ క్వాలిఫైంగ్ రౌండ్ జరిగింది. క్వాలిఫైంగ్ రౌండ్ ద్వారా పోల్ పోజిషన్ నిర్ణయిస్తారు. ఈ ఈవెంట్లో పలువురు క్రికెటర్లు సందడి చేశారు. సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, చాహల్, దీపక్ చాహర్ రేసింగ్ చూడడానికి వచ్చారు. వారిని చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. కాగా సాయంత్రం 45నిమిషాల పాటు మెయిన్ రేస్ నిర్వహిస్తారు. ఈ సమయంలో18 మలుపులతో ఉన్న  హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో 32 ల్యాప్స్‌ జరుగుతాయి. 45 నిమిషాల తర్వాత విన్నర్‌ను తేల్చేందుకు మరో ల్యాప్‌ నిర్వహిస్తారు. తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన వారు రౌండ్‌ 4 విన్నర్‌ అవుతాడు. అతనికి 25 పాయింట్లు దక్కుతాయి. తొలి పది స్థానాల్లో నిలిచిన వారికే పాయింట్లు లభిస్తాయి.