Vijay: వెండితెరపై ‘సీఎం’ టైటిల్ కార్డ్.. భారత సినీ చరిత్రలో విజయ్ సరికొత్త రికార్డ్!

Vijay: వెండితెరపై ‘సీఎం’ టైటిల్ కార్డ్.. భారత సినీ చరిత్రలో విజయ్ సరికొత్త రికార్డ్!

తమిళ రాజకీయాల్లో సంచలనంగా సృష్టించిన దళపతి విజయ్.. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. టీవీకే పార్టీ స్థాపించిన తక్కువకాలంలో ఎన్నికల్లో ఘనం విజయం సాధించి రికార్డులు సృష్టించారు.  అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు కైవసం చేసుకుని మిత్రపక్షాల సపోర్టుతో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే విజయ్ క్రేజ్ ఇప్పుడు వెండితెరపై కూడా సునామీలా మారుతోంది. దళపతి తన సినీ ప్రయాణానికి ముగింపు పలుకుతూ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) చుట్టూ ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోంది.  

 'సీఎం'గా వెండితెరపై ఎంట్రీ!

దక్షిణాది రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో 'జన నాయగన్' అప్‌డేటెడ్ టైటిల్ కార్డ్ ప్రదర్శితమవుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో విజయ్‌ను ఉద్దేశిస్తూ.. "గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇన్ 'జన నాయగన్' అని పేరు పడగానే థియేటర్లు విజిల్స్, కేకలతో దద్దరిల్లిపోతున్నాయి. సాధారణంగా ఒక నటుడికి 'పవర్ స్టార్' అనో, 'సూపర్ స్టార్' అనో బిరుదులు ఉండటం సహజం. కానీ, భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఓ నటుడి టైటిల్ కార్డుపై 'ముఖ్యమంత్రి' అనే హోదా కనిపించడం ఇదే తొలిసారి. ఇది కేవలం సినిమా ప్రమోషన్ మాత్రమే కాదు, ఒక చారిత్రాత్మక ఘట్టమని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

 

108 సీట్లతో రికార్డ్!

విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ఇటీవలే జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ ఏకంగా 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ అఖండ విజయం తర్వాత విజయ్ కేవలం ఒక నటుడిగా కాకుండా, ప్రజా నాయకుడిగా (జన నాయగన్) ప్రజల గుండెల్లో నిలిచారు. అందుకే సినిమాలో ఆయనను 'సీఎం'గా సంబోధించాలన్న ఫ్యాన్స్ డిమాండ్‌ను గౌరవిస్తూ చిత్ర యూనిట్ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.

భారీ అంచనాలతో రెడీ?
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది.చిత్రంలోని తీవ్రమైన రాజకీయ డైలాగులు, పొలిటికల్ రిఫరెన్స్‌ల కారణంగా ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ చిత్రం వెళ్ళింది.  విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా నటించిన చివరి సినిమా కావడంతో దీనిపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

►ALSO READ | RGV: రాజీనామా చేయరా? మమత మొండివైఖరిపై రామ్ గోపాల్ వర్మ ఘాటు విమర్శలు!

కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ నారాయణ విజయ్‌ను విప్లవకారుడు అని వర్ణించారు. షూటింగ్ సగం పూర్తయ్యాక విజయ్ సీఎం కావడం, ఇప్పుడు ఆ ప్రభావం సినిమాపై పడటం 'జన నాయగన్' స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. థియేటర్లలో కనిపిస్తున్న ఈ సంబరాలు రేపు సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించబోయే ప్రభంజనానికి కేవలం ట్రైలర్ మాత్రమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెన్సార్ వివాదాలు పరిష్కరించుకుని త్వరలోనే థియేటర్లలోకి అడుగుపెట్టనుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.